బాలయ్య బర్త్ డే అమెరికాలో..
- May 29, 2016
సినిమా వాళ్లు బర్త్ డేస్ ఎక్కడ, ఎలా జరుపుకొంటారో లాస్ట్ మినిట్ వరకు తెలీదు. కొందరు షూటింగ్ లో ఉండగా నిర్మాత సడన్ గా పూలమాల వేసి బర్త్ డే చేసేస్తాడు. కొందరు ఇంటి దగ్గర జరుపుకొంటారు. ఇంకొందరు సైలెంట్ గా పూర్తి చేసేస్తారు. అయితే ఫారిన్ లో తమ పుట్టిన రోజు జరుపుకునేవారు తక్కువే. ఆ ఛాన్స్ మన బాలకృష్ణ కొట్టేస్తున్నాడు. నందమూరి హీరో బాలకృష్ణ ఈసారి తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ని అమెరికాలో జరుపుకోబోతున్నాడు.బాలయ్య బర్త్ డే కి ఇప్పటి నుంచే అమెరికాలా గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 5న బాలకృష్ణ సియాటెల్ కు చేరుకుంటాడు. అమెరికాలో ఉన్న తన ఫ్యాన్స్ ను చూడాలని ఉందంటూ బాలకృష్ణ తన మనసులో మాట చెబుతూ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. దాంతో అక్కడి బాలకృష్ణ అభిమానులు సంబరపడిపోయారు. ఆయన బర్త్ డే కు చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు.అమెరికా వెళ్లబోయే బాలకృష్ణ సరికొత్త అందాలతో, యంగ్ హీరోలా తయారయ్యాడు. చక్కగా స్లిమ్ గా కనిపిస్తున్నాడు. మొరాకోలో తన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని ఈమధ్య హైదరాబాద్ చేరుకున్న బాలయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లెజెండ్ బాగా వెయిట్ తగ్గాడు. శాతకర్ణిలో యుద్ధ సన్నివేశాల్లో పాల్గొనేందుకు డైరెక్టర్ క్రిష్ చెప్పినమీదట బాలకృష్ణ బాగా వెయిట్ తగ్గించుకున్నాడట. దాదాపు 12 కిలోల వెయిట్ తగ్గాడని అంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







