మెగాస్టార్ బర్నింగ్ స్టార్‌ని అభినందించాడట
- May 29, 2016
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడ్ అనే పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. పెదరాయుడు గెటప్‌లో సంపూ చెప్పిన డైలాగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సోషల్ సైట్స్‌లో ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మెగా స్టార్ చిరంజీవి నిన్న సినీ కార్మికులకు సంబంధించి జరిగిన సన్మాన వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న సంపూ తన టీజర్‌ని చిరుకు చూపించాడు. సాయిధరమ్ తేజ్ లాంఛ్ చేసిన ఈ టీజర్లో సంపూ పర్ఫార్మెన్స్ చిరుని ఎట్రాక్ట్ చేసిందట. టీజర్‌ని చూసి ఓ చిరునవ్వు నవ్విన మెగాస్టార్ బర్నింగ్ స్టార్‌ని అభినందించాడట. ఇక ఆ సమయంలో సంపూ ఆనందానికి అవధులు లేవని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







