మెగాస్టార్ బర్నింగ్ స్టార్‌ని అభినందించాడట

- May 29, 2016 , by Maagulf
మెగాస్టార్ బర్నింగ్ స్టార్‌ని అభినందించాడట

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట చిత్రంలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడ్ అనే పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. పెదరాయుడు గెటప్‌లో సంపూ చెప్పిన డైలాగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సోషల్ సైట్స్‌లో ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మెగా స్టార్ చిరంజీవి నిన్న సినీ కార్మికులకు సంబంధించి జరిగిన సన్మాన వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న సంపూ తన టీజర్‌ని చిరుకు చూపించాడు. సాయిధరమ్ తేజ్ లాంఛ్ చేసిన ఈ టీజర్‌లో సంపూ పర్‌ఫార్మెన్స్ చిరుని ఎట్రాక్ట్ చేసిందట. టీజర్‌ని చూసి ఓ చిరునవ్వు నవ్విన మెగాస్టార్ బర్నింగ్ స్టార్‌ని అభినందించాడట. ఇక ఆ సమయంలో సంపూ ఆనందానికి అవధులు లేవని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com