ఎమిరాటీ జంటను పరామర్శించిన ఆర్టీఏ అధికారులు
- December 26, 2023
దుబాయ్: డిసెంబర్ 21న జరిగిన ఘోరమైన ప్రేగ్ మాస్ షూటింగ్ లో గాయపడిన ఎమిరాటీ దంపతులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతినిధి బృందం పరామర్శించింది. దంపతులిద్దరూ యూఏఈలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. భర్త అహ్మద్ ఇబ్రహీం ఒబైద్ అలీ అల్ అలీ ఉమ్ అల్ క్వైన్ మునిసిపాలిటీకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. భార్య రౌదా అల్ మెహ్రిజీ దుబాయ్‌లోని ఆర్టీఏలో మార్కెటింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈమేరకు వారిని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దంపతుల ఆరోగ్యాన్ని, అలాగే వారి ఇద్దరు కుమార్తెలు మరియం మరియు లతీఫా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దంపతులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. వారు సురక్షితంగా యూఏఈకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 21న ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో ఆయుధాలు ధరించిన 24 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







