టీటీడీ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు..

- December 26, 2023 , by Maagulf
టీటీడీ పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు..

 తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు.

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే..

  • టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం.
  • జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం.
  • రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం.
  • శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయం.
  • పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయం.
  • వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం .
  • ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయం.
  • కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం.
  • తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం.
  • తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం.
  • జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం. 
  • చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు.
  • శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం. 
  • శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు.
  •  పెద్ద జీయర్‌ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు.
  • చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com