అభితేజ్ సింగ్ మృతి..
- May 29, 2016
హిమాచల్‌ప్రదేశ్‌లోని రాంపూర్ బుషాహర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ తోబుట్టువు మనవడు అభితేజ్ సింగ్ మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..27 ఏళ్ల అభితేజ్ స్పితిలోని తన ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బైక్ స్కిడ్ అయి కిందపడిపోయారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అభితేజ్ వెనుకే మరో కారులో వస్తున్న అతడి స్నేహితులు గుర్పాల్ సింగ్, అభితేశ్ అతడ్ని గమనించి రాంపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అభితేజ్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అభితేజ్ తమ కుటుంబానికి ఒక్కడే కుమారుడని అతడి తండ్రి అభయ్ సంధు ఆవేదన వ్యక్తం చేశారు.అభితేజ్ మృతిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి సంతాపం తెలుపుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







