సత్యరాజ్ పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్ `దొర`
- May 29, 2016
చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో, తండ్రి పాత్రల్లో సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తమిళంలో ఓ పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌లో నటించారు. `జాక్సన్ దురై` పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో `దొర` పేరుతో విడుదల చేస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై జక్కం జవహర్‌బాబు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వం వహించారు. సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. బిందుమాధవి నాయిక. కరుణాకరన్, సహాయం రాజేంద్రన్ ఇతర కీలక పాత్రధారులు.
నిర్మాత జక్కం జవహర్‌బాబు మాట్లాడుతూ ``సత్యరాజ్‌గారికి తెలుగులో ఉన్న క్రేజ్ మనకు తెలిసిందే. ఆయన వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం ఈ `జాక్సన్ దురై`. తెలుగులో `దొర` పేరుతో అనువదిస్తున్నాం. తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీలను అందించారు. వెన్నెలకంటిగారు, చంద్రబోస్‌గారు చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగులు రాశారు. పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్ తరహా చిత్రమిది. అనువాద పనులు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో పాటలను, మూడో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో టీజర్‌కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. ఇటీవలికాలంలో వైవిధ్యమైన హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ కోవలో `దొర` కూడా తప్పక తెలుగు వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ జోనర్ కొత్తగా ఉంటుంది`` అని చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: యువరాజ్, సంగీతం: సిద్ధార్థ్ విపిన్, నేపథ్య సంగీతం: చిన్నా, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: ధరణీధరన్, నిర్మాత: జక్కం జవహర్‌బాబు.






తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







