మోదీ ఐదు దేశాల పర్యటన జూన్ 4న..
- May 29, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. జూన్ 4 నుంచి అఫ్గానిస్థాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. ఆయా దేశాధినేతలతో చర్చించనున్నారు.జూన్ 4న మోదీ అఫ్గాన్ బయలుదేరుతారు. అక్కడ రూ. 1400కోట్ల భారత నిధులతో నిర్మించిన సల్మా డ్యామ్‌ను మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఖతార్ వెళ్లి.. ఆ దేశాధిపతి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తనీతో ఆర్థిక సంబంధాలపై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.
ఖతార్ నుంచి మోదీ స్విట్జర్లాండ్ బయలుదేరుతారు. అక్కడ స్విస్ అధ్యక్షుడు జోహన్ షెనీదెర్ అమాన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్విస్ ఖాతాల్లో దాగిన భారత నల్లకుబేరులను బయటకు తీసుకొచ్చేందుకు ఇరువురు చర్చించనున్నారు. అక్కడి నుంచి జూన్ 7న మోదీ అమెరికా వెళ్తారు.అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో సమావేశంతో పాటు.. యూఎస్ కాంగ్రెస్‌లో మోదీ ప్రసంగించనున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ మెక్సికోలో పర్యటిస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







