‘డెవిల్’‌కీ సీక్వెల్ వుంది కానీ.!

- December 27, 2023 , by Maagulf
‘డెవిల్’‌కీ సీక్వెల్ వుంది కానీ.!

కళ్యాణ్ రామ్ తాజా మూవీ ‘డెవిల్’ ఈ ఏడాది చివరి అంకంలో రిలీజ్ అవుతూ ఏడాదికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా వుంది. డిశంబర్ 29న ‘డెవిల్’ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అవుతోంది.

పీరీయాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాల సంగతి అటుంచితే, చిత్ర యూనిట్.. కళ్యాణ్ రామ్ భారీగానే నమ్మకం పెట్టుకున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమాకి సీక్వెల్ కూడా వుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ రివీల్ చేశారు.

ఆల్రెడీ సీక్వెల్‌కి సంబంధించి 50 శాతం సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. అయితే, సీక్వెల్ విషయంలో ఇంకా క్లారిటీ లేదట.

సగానికి పైగా షూటింగ్ చేసి పక్కన పెట్టినప్పటికీ, మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాకే సీక్వెల్‌ని రిలీజ్ చేయాలా.? వద్దా.? అని ఆలోచిస్తామని కళ్యాణ్ రామ్ తెలిపారు.

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా ‘డెవిల్’లో కళ్యాణ్ రామ్ సాహసాలు అద్భుతంగా వుండబోతున్నయనీ, ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అవుతుందనీ నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి మరి, ఆ నమ్మకం నిజం కావాలంటే, కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com