‘డెవిల్’కీ సీక్వెల్ వుంది కానీ.!
- December 27, 2023
కళ్యాణ్ రామ్ తాజా మూవీ ‘డెవిల్’ ఈ ఏడాది చివరి అంకంలో రిలీజ్ అవుతూ ఏడాదికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా వుంది. డిశంబర్ 29న ‘డెవిల్’ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అవుతోంది.
పీరీయాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాల సంగతి అటుంచితే, చిత్ర యూనిట్.. కళ్యాణ్ రామ్ భారీగానే నమ్మకం పెట్టుకున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమాకి సీక్వెల్ కూడా వుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ రివీల్ చేశారు.
ఆల్రెడీ సీక్వెల్‌కి సంబంధించి 50 శాతం సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. అయితే, సీక్వెల్ విషయంలో ఇంకా క్లారిటీ లేదట.
సగానికి పైగా షూటింగ్ చేసి పక్కన పెట్టినప్పటికీ, మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాకే సీక్వెల్‌ని రిలీజ్ చేయాలా.? వద్దా.? అని ఆలోచిస్తామని కళ్యాణ్ రామ్ తెలిపారు.
బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా ‘డెవిల్’లో కళ్యాణ్ రామ్ సాహసాలు అద్భుతంగా వుండబోతున్నయనీ, ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్ అవుతుందనీ నమ్మకంగా చెబుతున్నారు. చూడాలి మరి, ఆ నమ్మకం నిజం కావాలంటే, కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







