ఒమన్‌లో పలువురు విదేశీ పౌరులు, ప్రవాసులు అరెస్ట్
- December 28, 2023
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు (ROP) బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో పలువురు విదేశీయులతో పాటు ప్రవాస మహిళలను అరెస్టు చేశారు. మస్కట్ గవర్నరేట్‌లో ప్రజా నైతికతను ఉల్లంఘించినందుకు, విదేశీయుల నివాస చట్టాన్ని ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన మహిళల బృందాన్ని అరెస్టు చేసినట్లు తెలిపింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది. మరో సంఘటనలో.. ఒమన్ సుల్తానేట్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు 10 మంది విదేశీ పౌరులను, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. ఇందులో ఆఫ్రికన్ జాతీయతకు చెందిన పది మంది ఉన్నారని, వారికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







