దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్నతాజా చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య
- December 28, 2023
హైదరాబాద్: వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఎప్పుడూ ముందుంటారు. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలో రూపొందిన బలగం వంటి మూవీ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే.
తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో సినిమాను తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుంటే, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు:
ఆశిష్, వైష్ణవి చైతన్య తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి, దర్శకత్వం: అరుణ్ భీమవరపు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్, ఆర్ట్: అవినాష్ కొల్ల, పి.ఆర్.ఒ: వంశీ కాకా
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







