వెంకీ సంక్రాంతి ‘విక్టరీ’ అందుకుంటాడా.?

- December 28, 2023 , by Maagulf
వెంకీ సంక్రాంతి ‘విక్టరీ’ అందుకుంటాడా.?

విక్టరీ వెంకటేష్.. విక్టరీ పేరులోనే వుంది. కానీ, ఫెయిల్యూర్స్ చాలానే చూశాడు కెరీర్‌లో వెంకటేష్. తాజాగా ‘సైంధవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటూ, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండడం విశేషం.

శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో సరికొత్త కథా, కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా వెంకటేష్‌కి ఖచ్చితంగా విక్టరీ తెచ్చిపెడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు, ఈ సినిమా వెంకీకి 75 వ సినిమా కావడం మరో విశేషం. ఈ సందర్భంగానే ‘వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఛీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి సినిమా చేయాలని వుందన్న తన మనసులోని కోరికను వెంకీ బయట పెట్టారు. ఈ సినిమా వెంకీకి మంచి విజయం చేకూర్చాలని చిరంజీవి మనసారా కోరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com