కువైట్ లో ప్రయివేటు రంగ కార్మికులకు శుభవార్త
- December 29, 2023
కువైట్: ప్రైవేట్ రంగంలోని కార్మికులు అసలు యజమాని ఆమోదంతో మరొక యజమాని కోసం పార్ట్‌టైమ్ పని చేయడానికి అనుమతిస్తూ ఒక నిర్ణయాన్ని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, షేక్ తలాల్ అల్-ఖాలీద్ జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 2024 నుండి అమలులోకి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ నుండి పార్ట్‌టైమ్ వర్క్ పర్మిట్ పొందిన తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులు రోజుకు గరిష్ఠంగా 4 గంటల పాటు మరొక యజమాని వద్ద పార్ట్‌టైమ్ పనిన చేసేందుకు అనుమతిస్తారు. రిక్రూట్మెంట్కు ప్రత్యామ్నాయంగా కువైట్‌లో ప్రస్తుతం ఉన్న శ్రామికశక్తి నుండి ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.
దీనితో పాటు ప్రైవేట్ రంగంలో రిమోట్ వర్క్‌ను అనుమతించాలని, ప్రక్రియను నిర్వహించడానికి నిబంధనలను సిద్ధం చేయాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ను మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







