కొత్త సంవత్సరం సందర్భంగా వర్షం కురుస్తుందా?
- December 29, 2023
యూఏఈ: 2024కు ఘనంగా స్వాగతం పలికేందుకు దుబాయ్ వాసులు సిద్ధమవుతున్నారు. అయితే, ఆరోజున ఆకాశం మేఘావృతమై సాయంత్రం చినుకులు పడే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM)లో జనరల్ మెటియోరాలజీ హెడ్ ఈసా అల్ సెరెడీ తెలిపారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. అయితే, తరువాతి రోజుల్లో పొగమంచు క్రమంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు రోజుల పాటు పొగమంచు ఏర్పడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ 31న నూతన సంవత్సర పండుగ సందర్భంగా పొగమంచు కప్పేస్తుందన్న అంచనా ఉందన్నారు. అలాగే, తాము సాధారణంగా తీర ప్రాంతాలతోపాటు ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమవుతుందన్నారు. తేలికపాటి వర్షం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇదే నెలలో మునుపటి సంవత్సరాలతో పోల్చితే తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. రస్ అల్ ఖైమాలోని పర్వతంపై నమోదైన ఉష్ణోగ్రత 9.9ºCకి చేరుకుందని సెరెడీ తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







