ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం
- December 31, 2023
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ-అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది.
ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. 'జై శ్రీరామ్' అంటూ స్వాగతం పలికారు.
'అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్' అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







