అగ్నిప్రమాదంలో గిడ్డంగుల దహనం

- May 29, 2016 , by Maagulf
అగ్నిప్రమాదంలో గిడ్డంగుల దహనం

భారీ అగ్ని ప్రమాదం కారణంగా షార్జా ఇండస్ట్రియల్‌ ఏరియాలో పలు వేర్‌ హౌస్‌లు (గిడ్డంగులు) దహనమయ్యాయి. షార్జా సివిల్‌ డిఫెన్స్‌ అధికారులు ప్రమాద వివరాల్ని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇండస్ట్రియల్‌ ఏరియా 18లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా హెడ్‌ క్వార్టర్స్‌, మువైల్‌, సమ్నాన్‌, అల్‌ మినా నుంచి ఫైర్‌ ఫైటర్స్‌ తక్షణం ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా తగిన చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com