తెలంగాణ: 23 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం
- January 03, 2024
హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం మరో 23మంది ఐపీఎస్ క్యాడర్ ఉద్యోగులకు స్థానచలనం కలిగించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేసిన ప్రభుత్వం సాయంత్రం ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ప్రభుత్వం మారింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర సేవలు అందించాలని గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే సమర్ధతను పరిగణలోకి తీసుకొని కొందరిని బదిలీ చేసినట్లు సమాచారం.
ఐక సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎల్ఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్, టీఎస్ ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్ కుమార్‌రెడ్డి, మాదాపూర్ డీసీపీగా జీ వినత్‌ను నియమించింది. జోగులాంబ డీఐజీగా జోయల్ డేవిస్, విష్ణు వారియర్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. పీవీ పద్మజను మల్కాజ్గిరి డీసీపీగా, నిర్మల్ ఎస్పీగా జీ జానకీ షర్మిల, జానకీ ధరావత్‌ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా, ఖమ్మం సీపీగా సునీల్‌దత్, సీఐడీ ఎస్పీగా ఎస్ రాజేంద్ర ప్రసాద్ బదిలీ అయ్యారు
ఆదిలాబాద్ ఎస్పీగా గౌష్ ఆలం, ములుగు ఎస్పీగా శబరీష్, మేడ్చల్ డీసీపీగా నిఖితా పంత్, సిద్దిపేట సీపీగా బీ అనురాధ, ఎల్బీనగర్ జోన్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బిరుదురాజు రోహిత్ రాజు, మెదక్ ఎస్పీగా బీ బాలస్వామి, భయశంకర్‌భూపాలపల్లి ఎస్డీగా అశోక్‌కుమార్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా ఆర్ వెంకటేశ్వర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







