నాసా ప్రయోగించిన రాకెట్ సెకన్లో పేలిపోయింది
- June 28, 2015
నాసా పర్యవేక్షణలో ప్రయోగించిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ కొద్ది సేపటికే కుప్పకూలింది. భారీ శబ్దం చేస్తూ శకలాలన్ని చెల్లా చెదురుగా సుదూర ప్రాంతాల్లో పడిపోయాయి. పేలిన సందర్భంలో ఆకాశంలో భారీ స్థాయిలో వెలుతురు విగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సాధారణంగా సరుకు రవాణా చేసేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అనే సంస్థ నాసా సహాయంతో అవసరాలకు తగినట్లుగా రాకెట్ ప్రయోగాలు చేపడుతుంది. ఆక్రమంలోనే ఆదివారం ఫ్లోరిడాలోని కేప్ క్యానవరాల్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు. ప్రయోగించిన కొద్ది సేపటికే రాకెట్ పేలిపోగా దాని తాలుకూ చిత్రాలను నాసా సంస్థ స్పష్టంగా చిత్రీకరించింది. రాకెట్ పేలిపోయిన విషయాన్ని నాసా వివరాలు ఎప్పటికప్పుడు అందించే జార్జ్ డిల్లర్ స్పష్టం చేశారు. అసలు ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని సంబంధిత సంస్థ ప్రకటించింది. ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంస్థ చేపట్టిన ప్రయోగాల్లో తొలి వైఫల్యం ఇదే కావడం విశేషం. రాకెట్ ప్రయోగించిన రెండు నిమిషాల 19 సెకన్లకే కూలిపోవడం అందరినీ ఒకింత షాక్ కు గురిచేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







