సందీప్ రెడ్డికి మెగా ప్రాజెక్ట్ కన్‌ఫామ్ అయినట్లేనా.?
- January 04, 2024
‘యానిమల్’ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో, మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఫోన్ చేసి మరీ అభినందించారట. సందీప్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అంటే, చాలా చాలా అభిమానం.
‘యానిమల్’ ప్రమోషన్లలో ఆ విషయం పదే పదే ప్రూవ్ చేసుకున్నాడు తన మాటల ద్వారా సందీప్ రెడ్డి వంగా. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఓకే అంటే ఆయనతో సినిమాకీ సిద్ధమే అన్నట్లుగా సంకేతాలు కూడా పంపించాడు.
అయితే, ప్రస్తుతం చిరంజీవి చాలా బిజీ. అలాగే, సందీప్ రెడ్డి కూడా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాడు ఆల్రెడీ. అందులో ‘స్పిరిట్’ ఒకటి. ప్రబాస్‌తో సందీప్ రెడ్డి తెరకెక్కించాల్సిన సినిమా ఇది.
‘యానిమల్’ రిజల్ట్‌తో ‘స్పిరిట్’ మూవీకి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ నేపథ్యంలో చిరంజీవితో ప్రాజెక్ట్‌కీ సందీప్ రెడ్డి వంగా తెర వెనక మంతనాలు చేస్తున్నాడనీ ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి ఓకే అంటే, తాను కమిట్ అయిన ప్రాజెక్టులనీ సునాయాసంగా పక్కన పెట్టేసి, చిరంజీవితో సినిమా తీసేందుకు సై సై అనేలా వున్నాడట సందీప్ రెడ్డి వంగా. అంతేగా.! తన అభిమాన హీరో డేట్స్ ఇస్తే.. ఊరుకోవడం ఏ అభిమానికీ సాధ్యం కాదు మరి. సందీప్ రెడ్డి కూడా అంతే.!
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









