వైష్ణవీ చైతన్య లక్కు మామూలుగా లేదు.!
- January 04, 2024
‘బేబీ’ సినిమాతో ఘన విజయం అందుకున్న ముద్దుగుమ్మ వైష్ణవీ చైతన్య. ఓ యూట్యూబర్‌గా సుపరిచితురాలైన వైష్ణవీ చైతన్యకు డెబ్యూ మూవీ ఇచ్చిన కిక్కు అలాంటిలాంటిది కాదు మరి.
హిట్ రావడం ఓ ఎత్తయితే, ఈ సినిమాలో వైష్ణవీ చైతన్య క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం మరో ఎత్తు. ఆమెలోని నటికి సాన పెట్టిన పాత్ర అది. ఫస్ట్ సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ పడినందుకు వైష్ణవీ చైతన్య నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పొచ్చు.
అందుకే ఆ అదృష్టం అలా కంటిన్యూ అవుతూ వస్తోంది. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఆ తర్వాత వైష్ణవీ చైతన్యను వెతుక్కుంటూ వస్తున్నాయ్.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో ఆయన మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా ‘లవ్ మి’ అనే సినిమాలో వైష్ణవి నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే, క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డతోనూ బేబీ ఇంకో సినిమాకి కమిట్ అయ్యింది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ, ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్లకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ వుంటుంది. సో, వైష్ణవికి ఇది కూడా కిక్కిచ్చే ప్రాజెక్టే. ఈ రోజు వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వైష్ణవి లుక్ రిలీజ్ చేసింది అధికారికంగా చిత్ర యూనిట్. ఈ లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..