నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుంది: సీఎస్
- January 04, 2024
హైదరాబాద్: ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు… అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో యువ వికాసం మినహా మిగతా ఐదు గ్యారెంటీలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన–అభయహస్తం దరఖాస్తులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఓ ప్రకటన చేశారు. ప్రజాపాలన డిసెంబర్ 28న ప్రారంభమైందని… జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని.. పొడిగించడం ఉండదని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి చెబుతూ, మరో నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి నాలుగు నెలలకు ఓసారి గ్రామాలు, పట్టణాలలో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తాజా వార్తలు
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీపై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం









