రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్.!
- January 05, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ సినిమాని ప్రకటించారు కూడా.
అయితే, ప్రస్తుతం రామ్ చరణ్, ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా వున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
షూటింగ్ జరుగుతోంది.. అంటున్నారు కానీ, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్టేట్ బయటికి రావడం లేదు. అఫ్కోర్స్.! శంకర్ సినిమాలంటే అలాగే వుంటుందనుకోండి.
ఈ సినిమా పూర్తి కాగానే బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమాని పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. గత కొంత కాలంగా ఈ కథపై బుచ్చిబాబు వర్క్ చేస్తున్నాడు.
కథ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసింది. ఈ లోపు నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టాడు బుచ్చిబాబు సన. ఆ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ సినిమా అంటే.. లార్జ్ స్కేల్లో వుండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు.. వారి పాత్రల చిత్రీకరణ కూడా చాలా బలంగా వుంటుంది. మరి, శివ రాజ్ కుమార్ కోసం బుచ్చిబాబు క్రియేట్ చేసిన పాత్ర ఎలా వుండబోతోంది.. అనేది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







