రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్.!

- January 05, 2024 , by Maagulf
రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ సినిమాని ప్రకటించారు కూడా.
అయితే, ప్రస్తుతం రామ్ చరణ్, ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా వున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
షూటింగ్ జరుగుతోంది.. అంటున్నారు కానీ, ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్టేట్ బయటికి రావడం లేదు. అఫ్‌కోర్స్.! శంకర్ సినిమాలంటే అలాగే వుంటుందనుకోండి.
ఈ సినిమా పూర్తి కాగానే బుచ్చిబాబు డైరెక్షన్‌లో సినిమాని పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. గత కొంత కాలంగా ఈ కథపై బుచ్చిబాబు వర్క్ చేస్తున్నాడు.
కథ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసింది. ఈ లోపు నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టాడు బుచ్చిబాబు సన. ఆ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ సినిమా అంటే.. లార్జ్ స్కేల్‌లో వుండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు.. వారి పాత్రల చిత్రీకరణ కూడా చాలా బలంగా వుంటుంది. మరి, శివ రాజ్ కుమార్ కోసం బుచ్చిబాబు క్రియేట్ చేసిన పాత్ర ఎలా వుండబోతోంది.. అనేది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com