తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ జూన్ 1 నుంచి
- May 29, 2016
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 25 హోటళ్ల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాళ్లలో సకినాలు, గారెలు, సంగటి, బిర్యానీ, హలీమ్ తదితర తెలంగాణ వంటకాలు కొలువుదీరనున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజ్ ఫలక్‌నుమా, తాజ్ కృష్ణ, తాజ్ బంజారా, వివంటా తాజ్, తాజ్ డక్కన్, మినర్వా గ్రాండ్, లెమన్ ట్రీ, ఎల్లా హోటల్స్, రాయల్ రీవ్, అలంకృత రిసార్ట్స్, ఆదిత్య పార్క్, హోటల్ బసెరా, ఓహ్రీ బంజారా, ఓహ్రీ 70 ఎంఎం, ఓహ్రీ నౌటంకీ, మ్యారియెట్, దస్పల్లా, ది ప్లాజా, మ్యారిగోల్డ్, ఆవాస్, గ్రీన్‌పార్క్, సెంట్రల్ కోర్ట్, పార్క్ హయత్ వంటి ప్రముఖ హోటళ్ల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







