140 భాషల్లో పాటపాడి గిన్నిస్ రికార్డు సాధించిన సుచేతా సతీశ్
- January 08, 2024
దుబాయ్: దుబాయ్ లో నివసిస్తున్న కేరళకు చెందిన సుచేతా సతీశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దుబాయ్‌లో గత ఏడాది నవంబర్ 24న జరిగిన కాప్-28 వాతావరణ సదస్సు వేదికగా 140 భాషల్లో పాటలు పాడారు.
ఆమె అద్భుత ప్రదర్శనకు అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. ఆమె సంగీత నైపుణ్యం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆమెకు అవార్డును బహూకరించారు. తాజాగా ఆ విషయాన్ని సుచేతా సతీశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
కాంప్-28కి హాజరైన 140 దేశాలకు ప్రతీకగా 140 భాషల్లో పాడినట్లు ఆమె వివరించారు. '' దేవుడి దయతోనే ఈ రికార్డు సాధించాను. 9 గంటల్లో 140 భాషల్లో పాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. నా వెన్నంటి నిలుస్తూ మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు'' అని సుచేతా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







