కీలక నిర్ణయం తీసుకున్న 'హనుమాన్‌' టీమ్

- January 07, 2024 , by Maagulf
కీలక నిర్ణయం తీసుకున్న  \'హనుమాన్‌\' టీమ్

హైదరాబాద్: 'హనుమాన్‌' టీమ్ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.

ఈరోజు హైదరాబాద్ లో 'హనుమాన్‌' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ద్వారా… హనుమాన్ టీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలోనే `హనుమాన్‌` వస్తోంది. అందుకే.. 'హనుమాన్‌' టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.

"అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన ఘట్టం. ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయం అందించొచ్చు. 'హనుమాన్‌' టీమ్ తీసుకొన్న ఈ నిర్ణయం చాలా గొప్పది. ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుంది. ఓ వరం అవుతుంది" అని చిరంజీవి ప్రశంసించారు. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 11 నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com