నా సామిరంగ.! అసలు సిసలు సంక్రాంతి బుల్లోడే నాగ్.!
- January 08, 2024
సంక్రాంతి సినిమాల్లో ఒకటైన ‘నా సామిరంగ’ అసలు సిసలు సంక్రాంతి మూవీగా అభివర్ణించబడుతోంది. ఈ సీజన్‌లో మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా వున్నాయ్.
మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ వున్న సినిమాలు. ‘సైంధవ్’ యాక్షన్ మూవీ. అయినా ఫర్లేదు అంచనాలు బాగానే వున్నాయ్. 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
అలాగే, 12న రాబోయే ‘గుంటూరు కారం’ సినిమా పైనా అంచనాలు వున్నప్పటికీ, ట్రైలర్ రెస్పాన్స్ మిక్స్‌డ్ వేలో వస్తోంది. ఇక, 14న సంక్రాంతికి విడుదలవుతోన్న ‘నా సామిరంగ’ మాత్రం అంచనాలు పెంచేస్తోంది.
నిజానికి లేట్‌గా సెట్స్ పైకి వెళ్లి అత్యంత వేగంగా పూర్తయిన సినిమా ‘నా సామిరంగ’. తక్కువ టైమ్‌లోనే సినిమాని చాలా బాగా డిజైన్ చేశారు. ప్రమోషన్లలో భాగంగా వదిలిన క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ కూడా ఆసక్తికరంగా వుంది.
ఇక, నాగార్జునతో పాటూ, అల్లరి నరేష్, రాజ్ తరుణ్.. వంటి యంగ్ హీరోల పాత్రలతో పాటూ, హీరోయిన్ ఆషికా రంగనాధ్ పాత్ర చిత్రీకరణ కూడా బాగుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే, ‘నా సామిరంగ’ సినిమాకి అన్నీ ప్లస్ పాయింట్స్‌గానే కనిపిస్తున్నాయ్. ఏమాత్రం ప్రచార చిత్రాలకు తగ్గట్లుగానే కంటెంట్ నచ్చిందంటే.. సంక్రాంతికి ఖచ్చితంగా నిలదొక్కుకునే సినిమా ‘నా సామిరంగ’.! ఇది ఫిక్స్..!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







