‘హనుమాన్’కి దండిగా ‘చిరు’ ఆశీస్సులు.!
- January 08, 2024
చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు ‘హనుమ్యాన్’ సినిమాని. అవును.. దర్శకుడు ప్రశాంత్ వర్మ చిన్నోడే. హీరో తేజ సజ్జా కూడా చిన్నోడే. కానీ, ‘హనుమ్యాన్’ పెద్ద స్కేలున్న మూవీ.
పదే పదే ఈ సినిమాని చిన్న సినిమా అంటూ ధియేటర్లు అందకుండా చేస్తున్నారు. అలాంటి ఈ సినిమాకి హనుమాన్‌కి అరి వీర భక్తుడు, స్టార్లలో మెగా అయిన మెగా స్టారుడు చిరంజీవి దన్నుగా నిలిచాడు.
ఇంత కన్నా పెద్ద దన్ను ఇంకేముంటుంది చెప్పండి ఇది పెద్ద సినిమా అని చెప్పేందుకు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసి మెగాస్టార్ చిరంజీవి ‘హనుమ్యాన్’ టీమ్‌ని ఆశీర్వదించారు.
సంక్రాంతి సీజన్‌లో వచ్చే సినిమాలకు చిన్న, పెద్ద తేడాలేమీ వుండవ్. కంటెంట్ బాగుంటే.. మొదటి షో కాకపోతే, రెండో షో చూస్తారు. లేదంటే రెండో రోజు చూస్తారు.. లేదా వారం తర్వాతయినా చూస్తారు.. కానీ, ఖచ్చితంగా చూస్తారు సినిమా బావుంటే.. అని టీమ్‌కి ధైర్యం చెప్పారు.
గతంలో ఇలా పెద్ద సినిమాల మధ్య సూపర్ సక్సెస్ అయిన పలు సినిమాలున్నాయని ఉదహరించారు చిరంజీవి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







