చిన్న పెట్టెల్లో దాగి సరిహద్దులు దాటే యత్నం.. పోలీసుల అదుపులో చొరబాటుదారులు
- January 09, 2024
యూఏఈ: రెండు SUVల వెనుక ట్రంక్‌ల కింద అమర్చిన చిన్న ఇనుప బాక్సుల్లో దాగి ఇద్దరు చొరబాటుదారులు యూఏఈలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. షార్జా పోర్ట్స్, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్స్ అథారిటీ (SPCFZA) చొరబాటు యత్నాన్ని అడ్డుకున్నది. ఎక్స్-రే స్కానర్‌లు అక్రమార్కుల దాక్కున్న ప్రదేశాలను అథారిటీ షేర్ చేసింది. అధికారులు షేర్ చేసిన వీడియోలో అధికారులు వాహనాల వెనుక బంపర్‌లను తెరిచినట్లు కనిపించింది. అక్కడ చొరబాటుదారులు 2 అడుగుల ఇనుప పెట్టెలో దాగి ఉన్నారు. కాగా, చొరబాటుదారుల వద్ద ఎలాంటి పత్రాలు లేవని, వాహనాల డ్రైవర్లు మరియు చొరబాటుదారులపై తదుపరి చర్యల కోసం సంబంధిత చట్టపరమైన అధికారులకు రిఫర్ చేసినట్లు టెర్మినల్స్, బోర్డర్ పాయింట్స్ అఫైర్స్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం అల్ రైసీ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..