ఖతార్ లో ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు
- January 09, 2024
దోహా : 2024 నాటి అమీరీ ఆర్డర్ నంబర్ (1) ద్వారా నియమించబడిన మంత్రులు సోమవారం ఉదయం అమిరీ దివాన్‌లో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ముందు ప్రమాణం చేశారు. ఖతార్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ అమీర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డిప్యూటీ అమీర్ హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్-థానీ, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-థానీలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం చేసిన వారిలో HE డా. అబ్దుల్లా బిన్ అబ్దులాజీజ్ బిన్ తుర్కీ అల్ సుబై(పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి), HE షేక్ హమద్ బిన్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్-థానీ(క్రీడలు మరియు యువజన మంత్రి), HE అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా(మునిసిపాలిటీ మంత్రి), HE ఇబ్రహీం బిన్ అలీ బిన్ ఇస్సా అల్ హసన్ అల్ మొహన్నాడి (న్యాయ మంత్రి మరియు క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి), HE సుల్తాన్ బిన్ సాద్ బిన్ సుల్తాన్ అల్ మురైఖీ(విదేశాంగ శాఖ సహాయ మంత్రి, క్యాబినెట్ సభ్యుడు) ఉన్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







