మణిరత్నం దర్శకత్వంలో రెహమాన్ కొడుకు !
- May 30, 2016
నాగార్జునా మహేష్ ల దగ్గరనుంచి చివరకు కొత్త హీరోయిన్ పూజా హెగ్డే వరకు మణిరత్నం సినిమాలు చేయలేము అని చెపుతూ దూరం జరిగిపోతూ ఉంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు12 సంవత్సరాల అమీన్ మణిరత్నం కొత్త సినిమాకు తన వత్తాసు పలుకుతున్నాడు. ఇప్పటికే ఓ హిందీ చిత్రంలో పాట పాడి తన సత్తా చాటిన అమీన్ చేత తమిళంలో కూడా చాలా సినిమాలకు పాటలు పాడిద్దామని చాలామంది ప్రయత్నించినా అమిన్ తండ్రి రెహమాన్ ఆ దర్శకుల కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అయితే మణిరత్నం కోరికను రెహమాన్ కాదనలేక పోయాడు అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రెహమాన్ ఈ రోజు అందుకున్న స్థాయికి మణిరత్నం కారణం కావడమే. 1992లో మణిరత్నం దర్శకత్వంలోని 'రోజా' చిత్రం ద్వారానే సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహ్మాన్ పరిచయమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ కావడంతో మొదటి సినిమాతో నే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి రెహమాన్ చేరుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదిగి పోయాడు. ఈ సెంటిమెంట్ తోనే మణిరత్నం దర్శకత్వంలోని చిత్రంలో అమీన్‌ను పాడించడానికి రెహ్మాన్ మణిరత్నం కోరికను కాదన లేక పోయాడు అని టాక్. ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసి విసిగి పోయిన మణిరత్నం తనకు గతంలో బాగా కలిసి వచ్చిన ప్రేమకధ అంశాన్నే ఎంచుకుని ఒక ఫ్రెష్ లవ్ స్టొరీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







