సీఎం జగన్‌తో కేశినేని నాని భేటి
- January 10, 2024
అమరావతి: ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపికి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం జగన్ ను కలిశారు. కేశినేని నాని, తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిరువురు సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టిడిపికి గుడ్ బై చెప్పడం తెలిసిందే. ఒకవేళ కేశినేని నాని వైఎస్ఆర్సిపిలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. కేశినేని నాని టిడిపికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించగా… కేశినేని శ్వేత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టిడిపి జెండాలను, చంద్రబాబు ఫొటోలను వారు కొన్నిరోజుల కిందటే తొలగించారు. ఇక వారు పార్టీకి రాజీనామా చేయడమే మిగిలుంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా