ఒమన్ లో నీటి కనెక్షన్ ఫీజు తగ్గింపు
- January 11, 2024
మస్కట్: నివాస యూనిట్లకు త్రాగునీటి సేవల కనెక్షన్ కోసం చెల్లించే మొత్తాలను తగ్గించాలని హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాలు పౌరులపై భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ (APSR) వెల్లడించింది. నీటి కనెక్షన్ సేవల తగ్గింపు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుందని APSR తెలిపింది. రెసిడెన్షియల్ యూనిట్ల నీటి కనెక్షన్ ఫీజులను OMR700 నుండి OMR200కి తగ్గించినట్లు వెల్లడించింది. అయితే, నాన్-రెసిడెన్షియల్ యూనిట్లకు (ప్రభుత్వం, పారిశ్రామిక, వాణిజ్య మరియు పర్యాటకులకు), నీటి కనెక్షన్ ఫీ భవనం, ప్రాంతం ప్రకారం వసూలు చేయబడుతుందని తెలిపింది. మొత్తం వైశాల్యం 500 చదరపు మీటర్లు (చ.మీ) కంటే తక్కువగా ఉన్న భవనాలకు OMR600.. 501 నుండి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR950.. 1,001 మరియు 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భవనాలకు OMR1,300, 2,001 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భవనాలకు OMR1,300 ఫీ లేదా అసలు కనెక్షన్ విలువ ఏది ఎక్కువ అయితే అది ఛార్జ్ చేయబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు