రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు.. పూర్తి వివరాలివే..
- January 11, 2024
అయోధ్య: అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
దేశంలోనే కాకుండా విదేశాల నుంచీ భక్తులు ఈ వేడుకకు రానున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రామయ్య సన్నిధికి చేరుకుంటారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఉచిత రైలును ప్రకటించింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ రైలు ద్వారా 20 వేల మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోనున్నారు. 18 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల వారు వైద్యపరంగా ఫిట్‌నెస్ ధ్రువపత్రం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. మొదటి దశలో 55 ఏళ్లు పైబడిన వారిని ఎంపిక చేస్తారు. యాత్రికుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు నిర్వహించనుంది. అవసరమైన నిధులను రాష్ట్ర పర్యాటక శాఖ అందిస్తుంది. ప్రజలకు కావాల్సిన బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లను ఐఆర్సీటీసీ అందిస్తుంది.
రాయ్‌పూర్, దుర్గ్, రాయ్‌ఘర్, అంబికాపూర్ స్టేషన్‌లలో ఈ రైలును ఎక్కవచ్చు. ఈ ప్రయాణం దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో చివరి స్టేషన్ అయోధ్య. యాత్రికులు వారణాసిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ వారిని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకెళ్లి గంగా హారతిని దర్శిస్తారు. కాగా ఇటీవలే.. జనవరి 22ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం డ్రై డేగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









