‘ఏక్ మినీ’ హీరోయిన్ డబుల్ ధమాకా.!

- January 11, 2024 , by Maagulf
‘ఏక్ మినీ’ హీరోయిన్ డబుల్ ధమాకా.!

అందాల భామ కావ్య థాపర్‌కి ఫిబ్రవరి నెల బంగారం కానుంది. ఒకే నెలలో ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్.

సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే, మాస్ రాజా రవితేజ సరసన ‘ఈగల్’ సినిమాలోనూ కావ్య థాపర్ నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుండగా.. ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ అయ్యింది.

మాస్ రాజా సినిమా అంటే ఓ రేంజ్ మూవీనే. సో, కావ్య థాపర్‌కి ఇది బెస్ట్ ఛాయిసే అని చెప్పాలి. ఒకవేళ అన్నీ కలిసొచ్చి ఈ సినిమా హిట్ అయ్యిందంటే.. స్టార్ హీరోల దృష్టిలో పడుతుంది కావ్య థాపర్.

శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి వర్ధమాన హీరోయిన్లకు సైతం స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కుతోంది. సో, లక్కుంటే ఏముంది.! ఆ అదృష్టం కావ్య థాపర్‌ని సైతం వరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com