మహేష్ తగ్గించాడు.. నాగార్జున పెంచాడు.!
- January 11, 2024
‘గుంటూరు కారం’, ‘నా సామిరంగా’ సినిమాలు సంక్రాంతి రేస్‌లో అంచనాల మీద విడుదలవుతున్న సినిమాలు. అయితే, ‘గుంటూరు కారం’ సినిమా రేపే అనగా జనవరి 12.. సంక్రాంతికి రెండు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సో, ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు. కానీ, ఇది చాలదు. సంక్రాంతి సినిమా అంటే ఏ రేంజ్‌లో ప్రమోషన్లు అదరగొట్టేయాలి. కానీ, అలా జరగడం లేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు.
ఇద్దరూ గ్లామరస్ భామలే. కానీ, ఇంటర్వ్యూల్లో ఎక్కడా ఈ గ్లామర్ కనిపించడం లేదు. ప్రమోషన్ల పేరు చెప్పి రిలీజయిన ప్రోమోలూ, పోస్టర్లు తప్ప.
కానీ, ‘నా సామిరంగ’ విషయానికి వస్తే.. ముగ్గురు హీరోయిన్లున్నారు. ఆషికా రంగనాధ్ మెయిన్ లీడ్ హీరోయిన్‌గా కాగా, రుక్సార్ మీర్, మిర్నా సెకండ్ హీరోయిన్లుగా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
అల్లరి నరేష్‌కీ, రాజ్ తరుణ్‌కీ జోడీగా నటిస్తున్నారు. ప్రమోషన్ల పేరు చెప్పి ఈ ముగ్గురూ చేస్తున్న గ్లామర్ హల్‌చల్ అంతా ఇంతా కాదు.. నిన్న మొన్నటి వరకూ కాస్తయినా ‘గుంటూరు కారం’ టీమ్ ప్రమోషన్ల జోరు మీదుంది.
ఇప్పుడా జోరు తగ్గింది. కానీ, ‘నా సామిరంగ’ జోరు మాత్రం మరింత పెరిగింది. సంక్రాంతి కానుకగా.. సంక్రాంతి రోజే గ్రాండ్‌గా రిలీజవుతోంది ‘నా సామిరంగ’. నాగార్జున అండ్ టీమ్‌కి ఈ సినిమా విజయంపై నమ్మకం వచ్చేసినట్లుంది. ఫుల్ జోష్‌తో ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







