‘ఏక్ మినీ’ హీరోయిన్ డబుల్ ధమాకా.!
- January 11, 2024
అందాల భామ కావ్య థాపర్‌కి ఫిబ్రవరి నెల బంగారం కానుంది. ఒకే నెలలో ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్.
సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే, మాస్ రాజా రవితేజ సరసన ‘ఈగల్’ సినిమాలోనూ కావ్య థాపర్ నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుండగా.. ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ అయ్యింది.
మాస్ రాజా సినిమా అంటే ఓ రేంజ్ మూవీనే. సో, కావ్య థాపర్‌కి ఇది బెస్ట్ ఛాయిసే అని చెప్పాలి. ఒకవేళ అన్నీ కలిసొచ్చి ఈ సినిమా హిట్ అయ్యిందంటే.. స్టార్ హీరోల దృష్టిలో పడుతుంది కావ్య థాపర్.
శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి వర్ధమాన హీరోయిన్లకు సైతం స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కుతోంది. సో, లక్కుంటే ఏముంది.! ఆ అదృష్టం కావ్య థాపర్‌ని సైతం వరిస్తుంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







