‘పుష్ప 2’ తగ్గేదే లే.! ఈ సారి అంతకు మించి.!
- January 11, 2024
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ఏ రేంజ్‌లో సంచలనాలు సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతో పాటూ, పలు భాషల్లోనూ ఈ సినిమా అంతకు మించి అనేలా వసూళ్లు రాబట్టింది.
దాంతో, రెండో పార్ట్‌పై బాధ్యత మరింత పెరిగింది. రెండో పార్ట్ షూట్ స్టార్ట్ చేయడానికే చాలా కాలం తీసుకున్నారు సుకుమార్ అండ్ టీమ్.
గతంలోని కథ కంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. అలా, ఫైనల్‌గా ‘పుష్ప 2’ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ‘పుష్ప 2’.
అలాగే ఇటీవల రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్లు. 2024 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ఈ సినిమాని తెలుగుతో పాటూ వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్ధమవుతున్నారు.
ఆ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పులూ వుండవనీ, ఆ టైమ్‌కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2’ను పూర్తి చేసేస్తామని మేకర్లు తాజాగా ఇంటిమేట్ చేశారు.
రష్మిక మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు ఫహాద్ పాజిల్ పాత్ర అత్యంత కీలకం ‘పుష్ప’ సెకండ్ పార్ట్‌కి. హీరోకీ, విలన్ అయిన ఫహాద్ పాజిల్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత శక్తివంతంగా వుండబోతున్నాయట.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి