121 వాహనాలు స్వాధీనం..500 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

- January 13, 2024 , by Maagulf
121 వాహనాలు స్వాధీనం..500 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు

యూఏఈ: దుబాయ్ పోలీసులు ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో 121 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని, వారిపై 500 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. అల్ ఖవానీజ్ నివాసితులు మరియు లాస్ట్ ఎగ్జిట్ వద్ద సందర్శకుల నుండి అనేక ఫిర్యాదులు తమకు అందాయని దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి చెప్పారు. ఈ నేపథ్యంలో చేపట్టిన తనిఖీలలో రాష్ డ్రైవింగ్, స్టంట్ డ్రైవింగ్‌కు పాల్పడ్డ 81 కార్లు, 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  గత ఏడాది జూలైలో అమలు చేసిన కొత్త దుబాయ్ ట్రాఫిక్ చట్టం ప్రకారం.. ప్రాణాలకు, ఆస్తికి మరియు ప్రజల భద్రతకు హాని కలిగించే నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరమని, ఆయా నేరాలకు పాల్పడితే వాహనాల జప్తుతోపాటు 50,000 దిర్హామ్ జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. స్మార్ట్‌ఫోన్‌లలోని దుబాయ్ పోలీస్ యాప్‌లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వి ఆర్ ఆల్ పోలీస్' సేవ ద్వారా ఏదైనా రహదారి భద్రత ఉల్లంఘనలను నివేదించాలని దుబాయ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com