బుక్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించిన భారతీయ మహిళలు
- January 13, 2024
కువైట్: కువైట్‌లోని భారతీయ మహిళలు (IWIK) బుక్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. పిల్లలలో చదివే అలవాటును ప్రోత్సహించడానికి ఈ బుక్ డొనేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుస్తకాలను సేకరించి వాటి తిరిగి పంపిణీ చేస్తారు. తమ పుస్తకాలను విరాళంగా ఇవ్వాలనుకునే వారు ఈ డ్రైవ్‌లో భాగం కావచ్చని నిర్వాహకులు కోరారు. పాత పుస్తకాలు - కథ-పుస్తకాలు, నవలలు, జీకే పుస్తకాలు మొదలైన వాటిని విరాళంగా అందజేయవచ్చని తెలిపారు. విరాళంగా ఇచ్చే పుస్తకాలు మంచి స్థితిలో ఉండాలని సూచించారు. చిరిగిన పేజీలు, కవర్లు, వదులుగా బైండింగ్ ఉన్నవి, పాఠశాల పుస్తకాలు అంగీకరించబడవని చెప్పారు. పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ఆసక్తి ఉన్నవారు జనవరి 20 లోపు వాట్పాప్(60617933)లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







