సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు
- January 13, 2024
సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి పండగ అనగానే పిండివంటలు గుర్తుకు వస్తాయి. సంక్రాంతి పండగకు రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. ఎన్నో వెరైటీలు నోరూరిస్తుంటాయి. వంటలతో ఆ ఇంట్లో సందడి నెలకొంటుంది. పిల్లాపాపల కేరింతలతో ఇళ్లలో పండగ వైభవం సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరూ..ఒక్కో రకం రుచులను చూస్తుంటారు. సంక్రాంతి పండుగల్లో వందల రకాల పిండి వంటకాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చెక్కలు:
సంక్రాంతికి చాలా మంది ఇళ్లలో చేసే పిండివంటకాల్లో ఒకటి చెక్కలు. పలు రకాల్లో వీటిని తయారు చేస్తారు. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కల తయారీ విధానం చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం – 4 కప్పులు
పెసరపప్పుు- 2 కప్పులు
సగ్గుబియ్యం – 1 కప్పు
నవ్వులు -3 టేబుల్ స్పూన్స్,
జీలకర్ర- 1 టీస్పూన్
వెన్న- 1 స్పూన్
కారం, ఉప్పు- రుచికి సరిపడా
నూనె- వేయించడానికి కావల్సినంత.
తయారీ విధానం:
సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసే ముందు బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండి చేసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, వెన్న వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుంటూ కలపాలి. ముద్దలా అయిన ఈ పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత చిన్న చిన్న చెక్కల్లా చేసుకుని వేడి నూనెలో వేసి ముదురు రంగు వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది.
నెలవంకల తయారీలా:
కావాల్సిన పదార్థాలు:
శనగపప్పుు- 1కప్పు
బియ్యంపిండి- పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు
బెల్లం తురుము – 1 కప్పు
యాలకుల పొడి – 1చెంచా
నూనె- వేయించడానికి కావాల్సినంత
తయారీ విధానం:
శనగపప్పు ఉడకబెట్టి ముద్దలుగా చేసుకోవాలి. అందులో బియ్యంపిండి, పచ్చికొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. మందంగా చపాతి పిండిలా వత్తుకుని అర్థచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని వేడినూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుమును మునిగేదాక నీళ్లు పోసుకుని తీగపాకం చేసుకోవాలి. అందులో యాలకుల పొడి వేసి ముందుగా వేయించుకున్న నెలవంకలను అందులో వేయాలి. 20 నిమిషాల తర్వాత గిన్నెలోకి తీసుకుంటే నెలవంకలు రెడీ.
సున్నండలు:
కావాల్సిన పదార్థాలు:
మినపప్పు- పావుకిలో
బెల్లం తురుము – పావు కిలో
నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – అర టీస్పూన్
తయారీ విధానం:
స్టౌ వెలిగించి ఒకపాన్ పెట్టుకుని అందులో మినపపప్పు వేసి 5 నిమిషాలు వేయించాలి. ఇవి వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని అదే పాన్ లో నెయ్యి వేసి మరిగించాలి. తర్వాత మినుమలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం తురుమును ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని తిప్పాలి. మినపపిండి, బెల్లం, యాలకుల పొడి అన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలపుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే ఘుమఘుమలాడే సున్నుండలు సిద్ధం.
తాజా వార్తలు
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్‌తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్









