వాట్సప్‌లో మరో సదుపాయం..
- January 14, 2024
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సప్.. గతేడాది ఛానెల్స్ ను పరిచయం చేసింది.ప్రస్తుతం దాన్ని విస్తరించే పనిలో పడింది. అందులో భాగంగానే ఛానెల్స్‌లో పోల్స్ క్రియేట్ చేసే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రూప్స్, చాట్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సప్ పోల్స్ ఇకపై ఛానెల్స్‌లోనూ దర్శనమివ్వనున్నాయి. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే 'వాబీటా ఇన్ఫో' తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకుంది.
సాధారణంగా వాట్సప్‌లో పోల్స్ నిర్వహించే విధంగానే ఛానెల్స్‌లోనూ పోల్స్ క్రియేట్ చేయొచ్చు. 'టెక్ట్స్ బాక్స్'లో కనిపించే అటాచ్మెంట్ సింబల్‌పై క్లిక్ చేయగానే 'Polls' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకొని క్రియేట్ చేయొచ్చు. ఛానెల్ నిర్వహిస్తున్న వ్యక్తికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పోల్స్ క్రియేట్ చేసే సమయంలో 'Allow single poll' ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ఫాలోవర్లకు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది. వాట్సప్ ఛానెల్స్‌ను అనుసరించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. పోల్స్‌లో ఎవరు పాల్గొంటున్నారనే విషయం ఛానెల్ క్రియేట్ చేసిన వ్యక్తులు కూడా తెలుసుకోలేరు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
ఐఫోన్లో సిక్టర్లు క్రియేట్ ఇలా..
నచ్చిన ఫొటోలు ఎంచుకొని వాటికి టెక్ట్స్ యాడ్ చేసి స్టిక్కర్లు క్రియేట్ చేసే సదుపాయాన్ని వాట్సప్ ఐఫోన్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఐఫోన్లో వాట్సప్ ఓపెన్ చేసి 'టెక్ట్స్ బాక్స్' పక్కన ఉండే స్టిక్కర్ ట్రేపై క్లిక్ చేసి అందులో కనిపించే 'Create Sticker' ఆప్షన్‌పై క్లిక్ చేసి నచ్చిన ఫొటో ఎంపిక చేసుకోవచ్చు. ఆపై మీకు నచ్చిన టెక్ట్స్, డ్రాయింగ్ వంటివి జోడిస్తే మీ స్టిక్కర్ రెడీ. ఇలా క్రియేట్ చేసిన స్టిక్కర్ ఇతరులకు షేర్ చేయగానే ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!