కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 16, 2024
కువైట్: ఐదు రోజుల పాటు కాశ్మీర్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ కువైట్‌లోని సధు హౌస్‌లో ప్రారంభమైంది. ఇందులో కాశ్మీర్ కు సంబంధించిన సున్నితమైన వస్త్రాలు, వారసత్వ కనీ నేత వస్త్రాలు, సోజ్నీ ఎంబ్రాయిడరీ పాష్మినా శాలువాల స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాశ్మీర్ లూమ్ కంపెనీ ఇండియా సహకారంతో సదు హౌస్ కువైట్ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్‌ను కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఆదివారం ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో కాశ్మీర్ లూమ్ పాతకాలపు-శైలి కోటులు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఇకత్-డైడ్ పాష్మినాతో పాటు పేపర్ మాచే సాంప్రదాయ క్రాఫ్ట్‌లో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన కుషన్లు, ఇంటి వస్తువుల క్యూరేటెడ్ కలెక్షన్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 18వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







