Dh100,000 బహుమతిని హెల్పర్ తో షేర్ చేసుకున్న విజేత
- January 16, 2024
యూఏఈ: డిసెంబర్ 31న జరిగిన బిగ్ టికెట్ లైవ్ డ్రా సందర్భంగా పది మంది విజేతలకు ఒక్కొక్కరికి Dh100,000 ప్రదానం చేశారు. గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్‌లో చురుగ్గా పాల్గొంటున్న జెడ్డా నివాసి కమలెద్దీన్ బద్ఘైష్ విజేతలలో ఒకరు. ఆ మొత్తాన్ని తన సహయకుడితో పంచుకుంటానని తెలిపారు. తనే నంబర్‌లను ఎంపిక చేశాడని, గెలిస్తే సగం బహుమతి మొత్తం ఇస్తానని చెప్పానని, చెప్పినవిధంగానే బహుమతిలో సగం ఇస్తానని ఈ 57 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ తెలిపారు. ఒక గెలుపు ఇద్దరి కుటుంబాల్లో సంతోషం నింపింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 3న జరిగే లైవ్ డ్రాలో ఒక అదృష్ట వ్యక్తి గ్రాండ్ ప్రైజ్ విన్నర్‌గా నిలుస్తారు. ఆ విజేతకు Dh15 మిలియన్ ప్రైజ్ మనీ అందజేస్తారు. బిగ్ టిక్కెట్‌ని అభిమానులు ఆన్‌లైన్‌లో లేదా ఇన్-స్టోర్‌ని సందర్శించడం ద్వారా తమ కొనుగోళ్లను చేయడానికి జనవరి 31 వరకు సమయం ఉంది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కౌంటర్లు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!