లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
- January 16, 2024
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయాన్ని , శిల్పకళా సంపదను సందర్శించారు. ఆలయంలో లేపాక్షి వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ తిరిగి ఆలయ విశిష్టతను, స్థలపురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి గుడిలోని వేలాడే స్తంభం గురించి అధికారులు మోదీకి వివరించారు.
అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోదీ పాలసముద్రంకు బయలు దేరారు. ప్రధాని పర్యటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







