70 పెవిలియన్లతో కహ్రామాన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

- January 16, 2024 , by Maagulf
70 పెవిలియన్లతో కహ్రామాన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

దోహా: కటారా గ్రామంలోని బిల్డింగ్ 12 వద్ద కహ్రామాన్ (అంబర్) కోసం తన అంతర్జాతీయ ప్రదర్శన 4వ ఎడిషన్‌ను కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రదర్శనకారుల భాగస్వామ్యం 70 పెవిలియన్‌లకు విస్తరించింది. గతంలో వీటి సంఖ్య 50 మాత్రమే. కటారా జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి మాట్లాడుతూ.. 2019లో ఎగ్జిబిషన్ ప్రారంభమైనప్పటి క్రమంగా ఇది విస్తరిస్తుందని తెలిపారు. ఇది ఖతార్ ప్రధాన ఈవెంట్‌గా ప్రత్యేకంగా నిలుస్తుందని, పోలాండ్ తర్వాత ఈ రంగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద అంతర్జాతీయ ప్రదర్శన ఇదేనని స్పష్టం చేశారు.  AFC ఆసియా కప్ సందర్భంగా ఈ సంవత్సరం ప్రారంభించిన ఎగ్జిబిషన్.. దేశీయ మరియు అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక్కడి పెవిలియన్లలో 'బ్లాక్ పెర్ల్' అనే ఓడ నుండి గుర్రాలు, పులులు మరియు ఫాల్కన్‌ల వంటి జంతువుల వరకు, కహ్రామాన్ ఇస్లామిక్ ప్రార్థన పూసలు మరియు క్లిష్టమైన సుభా సేకరణలు, వివిధ రకాల హస్తకళలతో ఈ ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంటుందని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com