రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు
- January 16, 2024
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనుంది.ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనుంది. మారిషస్ జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు.సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవింద్ జగ్నాథ్ పేర్కొన్నారు. భారత్‌లో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధాన మంత్రి ప్రవింద్ జగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







