నాసిన్‌ శిక్షణా కేంద్రంని ప్రారంభించిన ప్రధాని మోదీ

- January 16, 2024 , by Maagulf
నాసిన్‌ శిక్షణా కేంద్రంని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్​ను ప్రధాని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్​తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శించారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగింస్తున్న మోదీ, అనంతరం NACINకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com