ఖతార్ నేషనల్ ఆర్కైవ్స్‌ను ప్రారంభించిన అమీర్
- January 17, 2024
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం ఉదయం మషీరెబ్‌లో అమిరీ దివాన్‌తో అనుబంధంగా ఉన్న నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఖతార్‌ను ప్రారంభించారు. అనంతరం నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఖతార్ మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖతార్ రాష్ట్ర చరిత్రను పర్యవేక్షించే మార్గాలతో పాటు సేకరణ, ఆర్కైవ్‌లను భద్రపరచడం వంటి వాటి గురించి అధికారులు వివరించారు. అనంతరం వివిధ విభాగాలు, వాటి పని విధానాల వివరాలపై ప్రజెంటేషన్‌ను హిస్ హైనెస్ తిలకించారు. ఈ ప్రారంభోత్సవానికి పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖతార్ నేషనల్ ఆర్కైవ్స్ ధర్మకర్తల బోర్డు ఛైర్మన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ అత్తియా అమీర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పబ్లిక్, ప్రైవేట్, చారిత్రక మరియు జాతీయ పత్రాలను సేకరించి భద్రపరిచినట్లు పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో ఉన్న ఖతార్ చరిత్రను తెలియజేసే పత్రాల సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







